విద్యా సామగ్రి పేరుతో కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాల వ్యాపారాన్ని అడ్డుకోవాలి
1 min readజీఓ నంబర్ 1ను పటిష్టంగా అమలు చేయాలి: ఏఐఎస్ఏ ఉమ్మడి జిల్లా నాగార్జున డిమాండ్*
నంద్యాల జిల్లా డీఈఓ నంద్యాల మండల ఎంఈఓ కు వినతిపత్రం అందజేసిన aisa నాయకులు*
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా విద్యా సామాగ్రి దుకాణాలు ఏర్పాటు చేసిన కార్పొరేట్ ,ప్రవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి కి నంద్యాల ఎంఈఓ బ్రహ్మం నాయక్కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా aisa ఉమ్మడి జిల్లా కార్యదర్శి స్వామిదాసు నాగార్జున మాట్లాడుతూ…నంద్యాల జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ధన దాహానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతున్నారని. విద్యను ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వ్యాపారంగా మార్చేశారని నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా, జీఓ నెంబర్ 1 విరుద్ధంగా పాఠశాలల్ల్లోనే ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేసి డ్రెస్సులు, పుస్తకాలు, ఇతర విద్యాసామాగ్రి షూ మార్ట్లను నడుపుతూ.. యాజమాన్యాలు నిర్ణయించిన ధరకే విద్యార్థుల తల్లిదండ్రులచే అధిక ధరలకు కొనుగోలు చేయిస్తు విద్యార్థుల తల్లిదండ్రు ల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ వారి రక్తం పీల్చి పిప్పి చేస్తున్నారు తెలిపారు.ఇప్పటికైనా ఇష్టరాజ్యంగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘింస్తూ,విద్యని వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఆగడాలు అరికట్టాలని కోరారు.విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.లేని పక్షాన జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను,విద్యార్థుల తల్లిదండ్రులని ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐసా నాయకులు పవన్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.