సీపీఎం నాయకులపై బైరెడ్డి ఫైర్
1 min readబైరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ సీపీఎం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శివశంకర్ టాకీస్ దగ్గర ఉన్న పాండురంగ స్వామి దేవాలయం దగ్గర ఆదివారం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆలయ నిర్మాణానికి భూమి పూజకు వచ్చారు.కానీ ఇక్కడ చాలా సంవత్సరాల నుండి బంకులు ఏర్పాటు చేసుకున్న జీవనం సాగిస్తున్నారని వారు పన్ను కూడా కట్టారని పేదలు వ్యాపారం చేసుకుంటున్న ఇక్కడ భూమి పూజ వద్దని సీపీఎం నాయకులు చెప్పడంతో వారిపై బైరెడ్డి ఫైర్ అయ్యారు. బైరెడ్డి ఫైర్ కావడం పట్ల సోమవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో సీపీఎం జిల్లా నాయకులు ఎం నాగేశ్వరరావు, పక్కిర్ సాహెబ్,గోపాలకృష్ణ,బె స్తరాజు పాత్రికేయుల సమావేశంలో బైరెడ్డిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు కార్మికులకు న్యాయం చేయాలని అడిగినందుకు సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకులను బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దురుసుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని అన్నారు. నందికొట్కూరు పట్టణంలో సర్వే నెంబర్ 410 లో గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ అయిన తర్వాత కార్మికులు మెకానిక్ షెడ్లను వేసుకొని జీవనం పొందే వారిని పొందుతున్నారని ఆ స్థలాన్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి ఆధారాలు లేకపోయినా వాస్తవాలు తెలుసుకోకుండా ప్రోటోకాల్ పాటించకుండా స్థలంలో దౌర్జన్యంగా మత సెంటిమెంటుతో కార్మికుల స్థలంలో షాపుల నిర్మాణానికి పూనుకోవడం విచారకరమన్నారు.కార్మికుల కు న్యాయం చేయాలని వెళ్లిన సిపిఎం పార్టీ ప్రజాసంఘాల నాయకులను మీరు నాస్తికులు మీరు రౌడీలు,గుండాయిజం చేస్తున్నారు మీ అంతు చూస్తా మీ నుండి దేశం నాశనం అవుతుందని అసభ్యకరంగా ఒక సీనియర్ నాయకుడిగా పాత ఫ్యాక్షనిస్టు ధోరణితో గట్టి గట్టిగా కేకలు వేసి గాండ్రించడం పద్ధతి కాదన్నారు.దళిత నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం మత రాజకీయాలకు విచారకరమన్నారు.ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం మళ్లీ పాత ఫ్యాక్షనిస్టు భావాలతో ప్రజల మధ్యన వైరుధ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందెందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.మున్సిపాలిటీ స్థలంలో బైరెడ్డి ఏ ఆధారాలతో అక్కడికి వెళ్ళారు ఏ ప్రోటోకాల్ తో అక్కడికి వెళ్లారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు అన్నారు.ఆయన దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కోరారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేక పార్టీలు మారిన అతని ఫ్యాక్షనిస్టు భావాలు పోలేదని సీపీఎం నాయకులు అన్నారు.