కంట తడి పెట్టిన ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి
1 min readతర్తూరు జాతరలో కుటుంబ సభ్యులు అవమానించారు
మహిళ అని చూడకుండా రౌడీ మూకలతో తోయించారు
ప్రజాగళం సభలో భావోద్వేగానికి లోనైన శబరి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలో రౌడీయిజం తప్ప ఏమీ లేదని , బైరెడ్డి వారసత్వం నాదని, బైరెడ్డి పేరుచెప్పుకొని రాజకీయం లోకి వచ్చిన యువనాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డినే తిడుతున్నారని నందికొట్కూరు లో సోమవారం నిర్వహించిన ప్రజాగళం లో బైరెడ్డి శబరి అన్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంట్లో మహిళలకు ఇవ్వని గౌరవం రాష్ట్రంలోని మహిళలకు ఈ వైసీపీ గుండాలు గౌరవం ఇస్తారని అనుకోవడం లేదన్నారు.నాన్నను తిడితే సహించాను, మా అమ్మను తిడితే మాత్రం సహించనని, రౌడీ వేదవలతో తర్తూరు గ్రామంలో జాతర సందర్భంగా ఇంటి ఆడపిల్లను అని చూడకుండా నన్ను తోసేశారని బైరెడ్డి శబరి కంటతడి పెట్టుకున్నారు. ప్రజా గళం సభలో అందరూ ఆమె కంటతడి పెట్టడంతో మౌనంగా ఉండిపోయారు. ప్రజాగళం సభకు వచ్చిన మహిళలు భావోద్వేగాలకు లోనయ్యారు. నందికొట్కూరు అంటే రౌడీలా చేతుల్లో ఉండకూడదని, అభివృద్ధి ప్రధాత చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉండాలని అన్నారు.నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య ను ,ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని శబరి కోరారు.