అతి తక్కువ ధరకే.. ‘ సి.ఎం.ఆర్ ’ వస్ర్తాలు
1 min readసి.ఎం.ఆర్. ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ
- గుడివాడలో 38వ షాపింగ్ మాల్ ప్రారంభం
- అభిమానులను ఆకట్టుకున్న సినీతారలు నైనా సారిక, సంయుక్త మీనన్
గుడివాడ, పల్లెవెలుగు: ప్రపంచ వస్ర్త వ్యాపార విపణిలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న సి.ఎం.ఆర్. టెక్స్ట్ టైల్స్ మరియు జ్యుయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం… బుధవారం గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద మరో షాపింగ్ మాల్ ను ఘనంగా ప్రారంభించింది. సి.ఎం.ఆర్. ఫౌండర్ మరియు చైర్మన్ మావూరి వెంకటరమణ సమక్షంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా సినీ తారలు నైనా సారిక, సంయుక్త మీనన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ , పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జాతీయ విశ్వ హిందీ పరిషద్ అధ్యక్షులు, పిన్నమనేని వెంకటేశ్వరరావు మాజీ మంత్రివర్యులు, రావి వెంకటేశ్వరరావు, ఎ.పి.వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పిన్నమనేని బాబి, మాజీ చైర్మన్, గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్- శ్రీ యలవర్తి శ్రీనివాసరావు వైస్ చైర్మన్, గుడివాడ ఎన్.టి.ఆర్. స్టేడియం కమిటీ. శ్రీ బూరగడ్డ శ్రీకాంత్, ఇంఛార్జి, గుడివాడ జనసేన పార్టీ, శ్రీ కామేపల్లి తులసి, గన్నవరం ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కమిటీ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.
మగ్గాలపై నేసిన వస్ర్తాలు.. మా ప్రత్యేకత..
ఈ సందర్భంగా సి.ఎం.ఆర్. ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థను గత 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకే గుడివాడలో 38వ షోరూమును ప్రారంభించామని చెప్పేందుకు సంతోషిస్తున్నానన్నారు. సి.ఎం.ఆర్. లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందన్నారు. ప్రజలు తమకు కావాల్సిన అన్నిరకాల వేడుకలకు సి.ఎం. ఆర్. తగు విధంగా అన్ని మోడల్స్ లో కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించటం సి.ఎం. ఆర్. ప్రత్యేకత అన్నారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సి.ఎం.ఆర్. అందిస్తుందన్నారు.
వెరైటీ డిజైన్లకు.. కేరాఫ్.. సి.ఎం.ఆర్
అనంతరం సి.ఎం.ఆర్. మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ సి.ఎం.ఆర్. అంటే ది వన్ స్టాప్ షాప్ అన్నారు ఫ్యామిలీ అందరికీ సచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయన్నారు. తన 38వ షోరూమును గుడివాడలో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో లక్షలలో డిజైన్లు వేలల్లో వెరైటీలు లభిస్తాయన్నారు. ప్రస్తుత యువతరానికి నచ్చేవిధంగా అన్నిరకాల వెరైటీలు లభిస్తాయన్నారు.
సెల్ఫీలతో ఆకట్టుకున్న తారలు..
గుడివాడలో సి.ఎం.ఆర్. 38వ షోరూమును ప్రారంభించేందుకు విచ్చేసిన సినీ తారలు నైనా సారిక, సంయుక్త మీనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. షాపింగ్ మాల్ లో అన్ని సెక్షన్లు తిరిగి.. అన్ని రకాల వస్ర్తాలను పరిశీలించారు. పట్టు ఫ్యాన్సీ చీరలు తమకెంతో నచ్చాయన్నారు. ఆ తరువాత అభిమానులను అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ… వారితో సెల్ఫీ దిగారు. డ్యాన్సులతో ఫ్యాన్సును ఉర్రూతలూగించారు.