కేబినెట్ మీటింగ్ లో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల ప్రస్తావన లేకపోవడం బాధాకరం.. ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఉద్యోగ ,ఉపాధ్యాయ, పెన్షనర్లు నూతన ప్రభుత్వం పై ఆర్థిక బకాయిలు, కరువు భత్యం (డి ఏ), 12వ వేతన సవరణ (పీఆర్సీ), మధ్యంతర భృతి (ఐ ఆర్) మిగతా అన్ని విషయాలలో సకాలంలో అందుతాయని ఆశాభావంతో ఉన్నారని, అయితే నూతన కూటమి ప్రభుత్వం వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఏడు నెలలు కావస్తున్నా ఇంతవరకు 25 వేల కోట్ల ఆర్థిక బకాయిలు విషయంలో కావచ్చు, కరువు భత్యం ప్రకటన విషయంలో కావచ్చు, 12వ పిఆర్సి , మధ్యంతర భృతి(ఐ ఆర్) విషయంలో కావచ్చు, సానుకూల ప్రకటనలు లేవని,కేబినెట్ మీటింగులు నెల నెలా జరుగుతున్నా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎటువంటి చర్చలు లేవని, ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో మధ్యంతర భృతి(ఐ ఆర్) ప్రకటిస్తారని ఊహాగానాలు ఉన్నప్పటికీ ఈరోజు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎటువంటి చర్య లేకపోవడం, మద్యం తర భృతి (ఐ ఆర్)కూడా ప్రకటించకపోవడం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సంక్రాంతి కానుకగా 30% మధ్యతర భృతి,(ఐ ఆర్) ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు శ వన్న బాలాజీ ,ప్రధాన కార్యదర్శి జి వి సత్యనారాయణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.