కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ప్రచార జోరు
1 min readఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి..
10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న
ప్రస్తుత ఎమ్మెల్యే లంచగొండి, నమ్మకండి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : చింతలపూడి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో చింతలపూడి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మేమంతా మీ వెంటే అంటూ రోషన్ కుమార్ జోరుగా ప్రచారం చేశారు. తమ ఇంటికి వచ్చిన రోషన్ కు ప్రజలందరూ దీవెనలు అందిస్తూ వైసిపి ప్రభుత్వం లో గతకాలంలో పడిన సమస్యలను రోషన్ కు చెప్పుకుని తమ గోడు వెళ్ళబోసుకున్నారు.అనంతరం వెంకటాపురంలో జయహో బీసీ సమావేశం లో పాల్గొన్న రోషన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్దపీట వేసిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుకె దక్కుతుందని, 36 వేల మెజార్టీ ఇచ్చిన గత ఎమ్మెల్యే , నాకు కేవలం కోటి రూపాయలు మాత్రమే జగన్ నిధులు ఇచ్చాడని చెప్తున్నడు, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి పూర్తిగా లంచగొండి. నమ్మకండి అని,ఆయన్ను గెలిపిస్తే అభివృద్ధి మానేసి వచ్చిన బడ్జెట్ ను వచ్చినట్లు జేబులో వేసుకోవడమే పనిగా పెట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. స్థానికుడిగా గత 10 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలందరూ సహకరించాలని రోషన్ ఓటర్లను విజ్ఞప్తి చేశాడు.అదేవిధంగా 23వ తేదీన సోమవారం చింతలపూడి లో నామినేషన్ వేస్తున్నట్లు, నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రోషన్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఏంసి చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి మండల అధ్యక్షులు మాటూరి వెంకట్రామయ్య, చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ఐటిడిపి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు,వెంకటాపురం గ్రామ నాయకులు ఉపేంద్ర,జనసేన పార్టీ మండల అధ్యక్షులు చీదరాల మధు, చింతలపూడి మండల బీసీ అధ్యక్షులు మిద్దె సత్యనారాయణ ,రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కొమ్మరాజు సత్యనారాయణ,జిల్లా అధికార ప్రతినిధి పిల్లల శ్రీనివాస్ యాదవ్,జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి తూము విజయ్, వీర మహిళ మండల కార్యదర్శి గుమ్మిసెట్టి భారతి తదితరులు పాల్గొన్నారు.