PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తండ్రి విజయం కోసం ముమ్మరంగా ప్రచారం : అర్జున్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: నా తండ్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గం లోని పట్టణాలు,గ్రామలు అభివృద్ది చేసి ఉంటే, మీకు నమ్మకం ఉంది అంటే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ని మళ్లీ ఆశీర్వదించాలని వైసిపి యువ నాయకులు అర్జున్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్యాపిలి మండలంలోని నేరేడుచర్ల, వెంకటంపల్లి, సప్తగిరి,  రామకృష్ణాపురం గ్రామాలలో బుగ్గన అర్జున్ రెడ్డి విస్తృత ప్రచారం జడ్పిటిసి సభ్యులు బోరెడ్డి శ్రీరామరెడ్డి, వ్యవసాయ మండల సలహా చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, జి సి ఎస్ మండల కన్వీనర్ బోరా మల్లికార్జునరెడ్డి ఆధ్వరంలో ప్రచారం నిర్వహించారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచార నిర్వహిస్తూ తన తండ్రి అభివృద్ధి చేసి ఉంటే మళ్ళీ ఈసారి ఫ్యాను గుర్తుకి ఓటు వేసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ధనుంజయ శెట్టి, సాధనగిరి గోపాలు, సాధనగిరి బలరాం ఎల్ఐసి, కిష్టయ్య, గోవిందు, ఆచారి ,ధనుంజయ్య, భాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, తుమ్మ గురుడు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author