ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిఆర్ఓ కు వినతి
1 min readరద్దు చేయని పక్షంలో కార్యాచరణ మాల సంఘాల జేఏసీ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇంతవరకు కలిసి ఉన్న దళితులను ఏబీసీడీ లుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాల మహానాడు జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.వర్గీకరణను రద్దు చేయాల్సిందేనని ఒకవేళ రద్దు చేయండి పక్షంలో త్వరలోనే కార్యచరణను ప్రకటించడం జరుగుతుందని జేఏసీ నాయకులు కాసారపు వెంకటేష్,మద్రాస్ నాగరాజు,బి రాజీవ్ కుమార్ అన్నారు.కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు కు ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని శనివారం డిఆర్ఓ కార్యాలయంలో మాల సంఘాల జేఏసీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం భారతదేశ రాజ్యాంగమును ఉల్లంఘించడమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేయాలని రిజర్వేషన్లు ఎత్తివేయడంలో బిజెపి ప్రభుత్వం మొదటి దశ పూర్తి చేసిందని రెండవ దశ రిజర్వేషన్లు రద్దు చేయడం మూడవ దశ భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి బిజెపి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య వాదులు మేధావులు అంబేద్కర్ వాదులు ముందంజలో ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సుంకన్న గోపి దస్తగిరి నాగన్న తదితరులు పాల్గొన్నారు.