PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ …

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు  క్యాన్సర్ పై అవగాహన ర్యాలి  నిర్వహించినారు.ఈ ర్యాలీని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.భాస్కర్ గారు జెండా ఊపి ర్యాలి ప్రారంభించినారు.అనంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమం కింద జిల్లాలోని 18 సంవత్సరముల పైబడిన ప్రతి వ్యక్తికి  వారి ఇంటి వద్దే బ్రెస్ట్,ఓరల్ మరియు సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడo  జరుగుతుందని,ఈ పరీక్షలను శిక్షణ పొందిన వైద్య నిపుణులు నిర్వహిస్తారు.గ్రామీణ ప్రాంతాల్లో mlhpలు,ANM లు మరియు ASHAలు ఈ ప్రక్రియను అందించగా,పట్టణ ప్రాంతాల్లో UPHC స్టాఫ్ నర్సులు మరియు ANMలు ఈ స్క్రీనింగ్ లను పర్యవేక్షిస్తారు.లక్షణాలు ఉన్న కేసులను phc కు రిఫెర్ చేసి మరింత పరీక్షా చేయబడుతాయి ,ర్యాలి కోసం నినాదాలు క్యాన్సర్ పై విజయము స్క్రీనింగ్ తో సాధ్యము మరియు ముందస్తు పరీక్షా క్యాన్సర్ నుండి రక్ష  అనే నినాదాలతో ర్యాలి కొనసగడము జరిగినది.ఈ కార్యక్రమములో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు,RBSK&NCD ప్రోగ్రాం ఆఫీసర్ హేమలత , ,డాక్టర్.ఉమా  DPMO,DPO విజయరాజు , ,డెమో శ్రీనివాసులు, ఎపిడమలజిస్ట్ వేణుగోపాల్,DCM ప్రసాద్ ,రీజినల్  ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ జయలక్ష్మి ,NURSING  TUTORS,HE,పద్మావతి గారు,నర్సింగ్ విద్యార్థులు,ఆశా కార్యకర్తలు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *