క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యం
1 min readస్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా బాధితులకు సర్జరీలు, కీమోథెరపీ సేవలు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యం అని, జిల్లాలో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.శనివారం కర్నూలు వైద్య కళాశాలలో నిర్వహించిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తొలి సదస్సులో ప్రివెంటివ్ ఆంకాలజీ మరియు ప్యాలియేటివ్ కేర్ అన్న అంశంపై జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు కావడం చాలా గర్వకారణం అన్నారు. రాష్ట్ర క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ తొలి వార్షిక సదస్సు క్యాన్సర్ నివారణ, చికిత్సా విధానాలు, నూతన ఆవిష్కరణలను తెలియజేసే గొప్ప వేదికగా నిలిచిందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.. క్యాన్సర్ పై రీసెర్చ్, నివారణ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని, కర్నూలు వైద్య కళాశాల వైద్య విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి నివారణ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు..ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా సర్జరీలు, కీమోథెరపీ వైద్య సేవలను అందించేందుకు సుమారు రూ.30 కోట్ల వ్యయంతో కూడుకున్న వైద్య పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా తన దృష్టికి తీసుకొని వస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీకృష్ణ ప్రకాష్ తన స్వాగత ఉపన్యాసంలో మాట్లాడుతూ….ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రజలకు మంచి సేవలు అందుతాయని తెలియజేశారు. కర్నూలు పట్టణంలో ఉన్న ట్రిపుల్ ఐటీ డి ఎమ్ వతో అవగాహన ఒప్పందం కుదిరిందని,వారి సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి మెరుగైన వైద్య సేవలందించేలా కృషి చేస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ రిజిస్ట్రార్ కె.గురుమూర్తి మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మరి ద్వారా తన తల్లి,తండ్రులు మరణించడం జరిగిందని తెలుపుతూ తన సోదరుడు కూడా అమెరికాలో క్యాన్సర్ వ్యాధిపై రీసెర్చ్ చేస్తూ ఉన్నారని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన పంట ఉత్పత్తులను సేవించడం ద్వారా ఆరోగ్యం ఉంటుందన్నారు. 70 శాతం మేరకు క్యాన్సర్ వ్యాధులను సరైన సమయంలో గుర్తిస్తే వాటిని నివారణ చేసే అవకాశం ఉంటుందన్నారు.
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కర్నూలు జిల్లాలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అన్ని హంగులతో, పూర్తి వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కలుషిత ఆహారం, నీరు, గాలి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలునున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలి lపారు. కెనడా నుండి వచ్చిన టూవరల్డ్ క్యాన్సర్ కోఆర్డినేషన్ డైరెక్టర్ , డాక్టర్ సైమన్ సట్‌క్లిఫ్ మాట్లాడుతూ క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించి నివారించుకోవడం ఉత్తమమని, టూవరల్డ్ క్యాన్సర్ కొలాబరేషన్ ప్రతినిధులు ఇక్కడి విద్యార్థులకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తారని తెలియజేశారు.అంతకుముందు కార్యక్రమానికి హాజరైన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో కెనడా దేశ టూవరల్డ్ క్యాన్సర్ కొలాబరేషన్ ప్రతినిధులు డా.గిల్లియన్ ఫైల్స్, డా.మేరియాన్ మోర్గాన్డా లు మరియు డాక్టర్ గాయత్రి పలాట్ , వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.