PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అబద్ధపు చెరికలతో వైసిపి విజయాన్ని అడ్డుకోలేరు..

1 min read

జెడ్ పీ టీ సీ. అర్ బీ చంద్రశేఖర్ రెడ్డి

పల్లివెలుగు వెబ్ గడివేముల: మండలకేంద్రంలో గురువారం నాడు టిడిపి నాయకులు వైసిపి నుండి టిడిపి లో 100 కుటుంబాలు చేరాయని అబద్ధపు చేరికలతో టిడిపి నాయకులు తమ విలువలు కోల్పోయారని ఆరోపించారు. శుక్రవారం నాడు జెడ్ పీ టీ సీ. అర్ బీ చంద్రశేఖర్ రెడ్డి స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న టిడిపి పార్టీ లో చేరినవారు వైసిపి నాయకులు కార్యకర్తలు లేరని ప్రజలను మభ్య పెట్టడానికి ఈ రకమైన ప్రచారాలు చేసుకుంటున్నారని గతంలో టిడిపి లో ఉన్నవారినే కండువాలు కప్పడం మీ ఓటమిని ఒప్పుకున్నట్టేనని అన్నారు టిడిపి కండువా కప్పుకున్న వారు వైసిపి పార్టీ చెందినవారు కాదని టిడిపి పార్టీలో చేరిన వారిలో  మాజీ సర్పంచ్ జమాల్ బాషా మాత్రమే మా వెంట ఉండి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  సహకారంతో సర్పంచుగా గెలిచి పార్టీ కార్యక్రమాలకు గత ఎనిమిది సంవత్సరాల నుండి దూరంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ చెందిన వారితో తిరుగుతూ ఉండేవాడని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోన్ని వైసిపి పార్టీ నుండి చేరామని చెప్పడం సరైన కాదని విమర్శించారు. 100 కుటుంబాలు వైసిపి పార్టీ చెందినవారు టిడిపిలో చేరారంటూ ప్రచారం చేయడం సరైనది కాదన్నారు. తెలుగుదేశం పార్టీ వారు ఎంత ప్రచారం చేసిన నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా చేసుకోవాలని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఏప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాన్ని మరియు అభివృద్ధి  చేసేది ఒక జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రజలు కష్టసుఖాలు తెలుసుకొని విద్య, వైద్యం కోసం ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలను ఆవే పథకాలను చంద్రబాబు నాయుడు  చేస్తాను అని అనడంతో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు బాగుండాయి కాబట్టే చంద్రబాబు నాయుడు కూడా ఆ పథకాలనే ప్రజలకు అందజేస్తామని అంటున్నాడు ఆని విమర్శించారు. గడివేములలో తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్ ఇంతవరకు ఒక బోరు కూడా వేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సహకారంతో గడివేములకు మంచినీటి సమస్య రాకుండా ముందుగానే గ్రామానికి అదనంగా బోర్లు వేయించి గడివేములకు నీటి సమస్య రాకుండా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ బాల చేయన్ని, మాజీ ఎంపిటిసి సంజీవరెడ్డి, నంద్యాల వెంకటేశ్వర్లు, నాగేశ్వర్ రెడ్డి, సివి రమణయ్య, ఎంపీటీసీ మహేశ్వర్ రెడ్డి, రసూల్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

About Author