ఏలూరు నియోజకవర్గంలో పలు అన్న క్యాంటీన్లు ప్రారంభం
1 min readప్రారంభించిన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
అన్నా క్యాంటీన్ ల నిర్వహణకు 1,25,000/-లు జీతాన్ని విరాళం
సేవాగుణం తో ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు తోడ్పడాలని పిలుపు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగరంలో ఆకలి తీర్చే అన్న క్యాంటీ న్ లకు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తన మొదటి నెల జీతాన్ని (ఒక లక్ష 25 వేల రూపాయలు) విరాళంగా ఇచ్చి తన విశాల హృదయాన్ని దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈరోజు ఏలూరు నగరంలో మొత్తం నాలుగు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారికి పట్టేడ అన్నం పెట్టే ఆశయంతో కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తుందన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించేలా సేవలందించే వారికి స్ఫూర్తిగా నిలిచేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకెళ్తూతున్నారన్నారు. ఎమ్మెల్యేగా తన తొలి నెల జీతం అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళం ఇస్తున్న అనితెలిపారు. అదేవిధంగా పలువురు నేతలు పేదల హర్షా ధ్వనుల మధ్య ఎమ్మెల్యే క్యాంటిన్ లను ప్రారంభించడంతో పాటు పేదవాళ్లతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. ప్రతి ఒక్క కుటుంబo ప్రభుత్వానికి అండగా ఉండాలని తమ వంతు సేవగా విరాళాలు అందించి ప్రభుత్వ పథకాలకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ యం ఆర్ పెదబాబు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ గునుపూడి రవి, మాజీ కార్పొరేటర్ (విప్) గూడవల్లి వాసు, డాక్టర్:బంక రవి కుమార్, దాసరి ఆంజనేయులు, శ్రీనివాస్ పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.