PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూపీలో ‘కార్డియాలజి’ విధానాలపై పరిశీలన

1 min read

లక్నోలో  కార్డియాలజి మీటింగ్​ లో పాల్గొన్న డా. చంద్రశేఖర్​

కర్నూలు, పల్లెవెలుగు:ఉత్తర్​ ప్రదేశ్​లోని లక్నోలో గుండెకు సంబంధించిన వ్యాధులపై చికిత్స, శస్ర్తచికిత్స తదితర అంశాలను పరిశీలించినట్లు  కర్నూలు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్​ కార్డియాలజి ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ తెలిపారు. ఆదివారం లక్నోలో  కార్డియాలజికల్​ సొసైటీ ఆఫ్​ ఇండియా ఎగ్జిక్యూటివ్​ కమిటీ మీటింగ్​ జరిగింది.   సమాశంలో భాగంగా ఉత్తర ప్రదేశ్​లో  గుండెకు సంబంధించిన సర్జరి, బైపాస్​ సర్జరి తదితర వాటిని పరిశీలించిన అనంతరం చర్చించినట్లు ఆంధ్ర ప్రదేశ్​ తరుపున కమిటీ మెంబరైన డా. చంద్రశేఖర్​ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబరు 5 నుంచి 8వ తేదీ వరకు లక్నోలో జరుగు కార్డియాలజికల్​ సొసైటీ ఆఫ్​ ఇండియా ఎగ్జిక్యూటివ్​ కమిటీలో దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి మెంబర్లు పాల్గొంటారని, అందులో భాగంగానే మూడు నెలలపాటు యూపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో సర్జరీ, బైపాస్​ సర్జరికి సంబంధించి అందించే చికిత్స, తదితర విధానాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం తరుపున కార్డియాలజీ వైద్యులు ఈ కమిటీ మీటింగ్​ లో పాల్గొంటారని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ వెల్లడించారు. కాగా కార్డియాలజికల్​ సొసైటీ ఆఫ్​ ఇండియా ఎగ్జిక్యూటివ్​ కమిటీ మీటింగ్​కు డా. చంద్రశేఖర్​ ఎంపికై..  యూపీలో ఏపీ విధానాలను కూడా వివరించడం అభినందించదగ్గ విషయమని ఇండియన్​ మెడికల్​ సొసైటీ (ఐఎంఏ) సభ్యులు డా. రామచంద్ర నాయుడు, వైస్​ ప్రెసిడెంట్ డా. విజయమోహన్​ తెలిపారు.

About Author