జోరుగా సాగుతున్న కర్ణాటక మద్యం?
1 min readప్రసిద్ధి చెందిన ఆలయ ఆవరణంలో కర్ణాటక మద్యం ప్యాకెట్లు దర్శనం??
నిద్రమత్తులో అధికారులు
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కర్ణాటక అక్రమ మద్యం తరలించకుండా , విక్రయించకుండా పలు ఆదేశాలు జారీ చేస్తూ ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కౌతాళం మండలంలో మాత్రం కర్ణాటక మద్యన్ని నియంత్రించడంలో పోలీస్ అధికారులు విఫలమైనట్లు తెలుస్తుంది. పోలీసులు కళ్ళుకప్పి కర్ణాటక సరిహద్దు నుంచి ఆంధ్రాకు కర్ణాటక మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయంలో ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం ఒకటి.ఈ భాగంగా దేవస్థానానికి తెలంగాణ, కర్ణాటక,వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యల భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.అయితే ఈరన్న స్వామిని దర్శించుకునే ఆవరణ బయట కర్ణాటక మద్యం ప్యాకెట్లు కనిపిస్తున్నాయి.ప్రభుత్వం మద్యం ప్రియులకు ధరలు తగ్గించి తక్కువ ధరకు మద్యం ఇచ్చినప్పటికి కర్ణాటక మద్యానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. మండలంలోని వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా కర్ణాటక టేట్రా ప్యాకెట్ మద్యం విక్రయాలు నడుస్తున్నాయి.పోలీసు అధికారులు, ఆలయ పర్యవేక్షకులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.?