PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాక్షన్ టెసా ఆధ్వర్యంలో ఘనంగా కార్పెంటర్ దినోత్సవం వేడుకలు

1 min read

అవదేశ్ జైన్,యాక్షన్ టెసా సంస్థ వైస్ ప్రెసిడెంట్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరం,కొత్తబస్టాండ్ హోటల్ షైన్ రిజెన్సీ హోటల్ లో సోమవారం యాక్షన్ టెసా ఆధ్వర్యంలో ఘనంగా కార్పెంటర్ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమానికి యాక్షన్ టెసా సంస్థ వైస్ ప్రెసిడెంట్ అవదేశ్ జైన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై.జనార్దన రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యాక్షన్ టెసా భారతదేశం యొక్క నెం.1 ప్యానెల్ పరిశ్రమ సంస్థ అని చెప్పారు.యాక్షన్ టెసా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ కార్పెంటర్స్ పట్ల తన ప్రగాఢమైన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఆదేశాల మేరకు కార్పెంటర్స్ దినోత్సవ” పర్వదినాన్ని పురస్కరించుకొని టెసా సలాం అనే నినాదాన్ని కార్పెంటర్స్ కు అంకితం చేయాలనే లక్ష్యంతో ప్రతి నెల కార్పెంటర్స్ సమావేశాలని నిర్వహించాలని సంస్థ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.ఈ వార్షిక కార్యక్రమంతో మా చిరకాల స్వప్నం నిజమైందన్నారు.ఇంజనీరింగ్ చెక్క పరిశ్రమకు వడ్రంగులు వెన్నెముక అని, వారి నైపుణ్యాలు,సృజనాత్మకతను గొప్ప స్థాయిలో జరుపుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.కార్పెంటర్స్ దినోత్సవాన్ని మరింత అర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని, భవిష్యత్ సంవత్సరాల్లో వేడుకలను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అజయ్ అగర్వాల్  వెల్లడించారన్నారు.ఈ సంవత్సరం ఈవెంట్ యొక్క ప్రాముఖ్యతను జోడిస్తూ,యాక్షన్ టెసా సరికొత్తగా టెసా సలామ్’ పేరుతో ఒక వీడియోను విడుదల చేసినట్లు చెప్పారు.ఈ వీడియో కార్పెంటర్‌ల అంకితభావం, సృజనాత్మకతను తెలియచేస్తోందని అన్నారు.హస్తకళాకారులు ఇంటీరియర్‌లను రూపొందించడం, ఫంక్షనల్ లివింగ్ స్పేస్‌లను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని వీడియో హైలైట్ చేసిందన్నారు.ఈ వీడియో వివిధ ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు.దీని కృతజ్ఞతా సందేశం దేశవ్యాప్తంగా ఉన్న  వడ్రంగులకు చేరుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టెసా సంస్థ అధికారులు గుణశేఖర్ రెడ్డి,విష్ణు కుమార ఆచారి,అమర్ నారాయణ్,సూరజ్ బాషా,రాజశేఖర్,ప్రసాద్,హరిప్రసాద్ రెడ్డి,అజారుద్దీన్,సంతోష్,శ్యాముల్,కార్పెంటర్ లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *