గతంలో జేఏసీ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
1 min readఉద్యోగులు,ఉపాధ్యాయుల పై పెట్టిన కేసులపై సానుకూలంగా స్పందించాలి
జిల్లా ఎస్పీని కలిసిన ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, జేఏసీ సంఘ నాయకులు
సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా సూపురింటెండెంట్ ఆఫ్ పోలీస్ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారిని మర్యాద పూర్వకంగా కల్సిన ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, పి ఆర్ టి యు అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, ఏపీటీఎఫ్ అధ్యక్షుడు గగులోతు కృష్ణ, డి టి ఎఫ్ అధ్యక్షుడు ఆదినారాయణ 2022 ఆగస్టులోసీపీఎస్ ఉద్యమం లో పాల్గొన్న జె ఏ సి నాయకులు పై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలనికోరారు. ఎస్పి స్పందిస్తూఏలూరు జిల్లా కలెక్టర్ కి ఫైల్ పెట్టి ఉద్యమం లో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు పై పెట్టిన కేసులు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుంటామని జె ఏ సి నాయకులు కు హామీ రన్నరు. అదే విధంగా ఏలూరు జిల్లా కొయ్యల గూడెం మండలం కొయ్యలగూడెం లో 1965 లో లిటరసీ రిక్రియేషన్ సెంటర్ ఎల్ ఆర్ సి కి 13 సెంట్లు భూమి ఉందని, సదరు భూమి ని కొంతమంది అక్రమార్కులు ఆక్రమించి, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జె ఏ సి చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ SP జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు. అక్రమార్కుల పై కేసు పెట్టి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారన్నరు. ఈ సందర్భంగా ఎస్పీకి జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.