‘క్యాథ్ ల్యాబ్ ’తో …అత్యధిక ప్రొసీజర్లు…
1 min read10 నెలలో 550 చేసిన ఘనత… ‘జెమ్ కేర్ కామినేని’
- వెల్లడించిన హాస్పిటల్ సీఈఓ డా. చంద్రశేఖర్
కర్నూలు, పల్లెవెలుగు: రాయలసీమలోనే అత్యంత వేగంగా కేవలం మొదలు పెట్టిన 10 నెలల్లో నే 550 కి పైగా ప్రొసీజర్లు చేసి క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్లో తిరుగులేని హాస్పిటల్ గా దూసుకెళ్తుందని జెమ్ కేర్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ తమ దగ్గర అత్యంత ఆధునిక ఎక్విప్మెంట్ గల క్యాత్ ల్యాబ్ 24/7 అందుబాటులో వుండీ , ప్రత్యేకమైన టీం తో వుంటుందని తెలిపారు. ఈ 550 ప్రొసీడర్స్ సంక్లిష్టమైన స్టెంటింగ్, చిన్న పిల్లలో సంక్లిష్టమైన వాల్ రీప్లేస్మెంట్ లు ఎన్నో జరిగాయి అని పేస్‌మేకర్స్ లో కండక్షన్ పేసింగ్ సిస్టమ్ లాంటి అత్యాధునిక ప్రొసీజర్స్, కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ లో రోటబ్లేషన్, IVUS , బెలూన్ వాల్వులోప్లాస్టీ, హార్ట్ లో హోల్సకి డివైస్ క్లోజర్స్ లాంటి అరుదైన క్లిష్టమైన ప్రొసీడర్స్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఛీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ రాఘవేంద్ర గారు మాట్లాడుతూ అనతి కాలంలోనే క్యాథ్ ల్యాబ్ లో 550 కి పైగా ప్రొసీజర్స్ చేయడం చాలా గర్వకారణంగా ఉందని తనకు సహకరించిన తన టీం కి , హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో మరెన్నో సర్జరీలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గణేష్, సి ఓ ఓ. నదీమ్, జనరల్ మేనేజర్ మరియు క్యాథ్ ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు.