ముఖ్యమంత్రిని కలిసిన సీబీఎన్ ఆర్మీ మండల అద్యక్షుడు ముల్లా మోయిన్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసిన సీబీఎన్ ఆర్మీ మండల అద్యక్షుడు ముల్లా మోయిన్…హోళగుంద మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వినతి….సీబీఎన్ ఆర్మీ హోళగుంద మండల అద్యక్షుడు ముల్లా మోయిన్ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను కలిశారు. మండలంలో నెలకొన్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అహ్మద్, ముస్తాక్ అహ్మద్ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న వివిధ సమస్యల ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా హోళగుంద – ధనాపురం రోడ్డు సమస్యను ముఖ్యమంత్రికి వివరించారు. రోడ్డు సమస్యలతోపాటు మండలంలో నెలకొన్న వివిధ సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీల ఈద్గా మరియు స్మశాన వాటికకు ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పకుండా మండలంలోని సమస్యలాన్నింటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సీబీఎన్ ఆర్మీ మండల అద్యక్షుడు ముల్లా మోయిన్ తెలిపారు.ఆలూరు తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో మండలంలో నెలకొన్న సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.