6 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు …
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద చాలా కాలంగా సీసీ రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న స్థానిక పేట బసవేశ్వరస్వామి ఆలయ పరిసర వాసులు, గ్రామస్తుల సమస్య ఎట్టకే లకు తీరింది. సోమవారం ఎంపీపీ నూర్జహన్బీ ఆధ్వర్యంలో మండల పరిషత్ నిధులు దాదాపురూ.6 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గతంలో గ్రామస్తులు ఈ రోడ్డుపై రాకపో కలకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అలాగే మురుగు నీరు నిలిచి పారిశుద్ధ్యం లోపించి దోమల బెడద తీవ్రంగా ఉండేది. సమస్యను ఉన్నతాధికారుల దృ ష్టికి తీసుకెళ్లడంతో నిధులు విడుదలవడంతో పనులు ప్రారంభించారు. ఈశా, ఎంపీటీసీలు కెంచప్ప, శివన్న, మల్లయ్య, అబ్దుల్ హమీద్, అనీష్ అద్దు సలాం, పాల్గొన్నారు.