పెద్దహ్యట గ్రామం ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు చేపట్టిన కూటమి ప్రభుత్వం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద మండల పరిధిలోని పెద్దహ్యాట గ్రామంలో ఎస్సీ కాలనీ నందు సిసి రోడ్లు నిర్మించడం జరిగింది, కాలనీలో సుమారు 75 సంవత్సరాలైనా కూడా రోడ్లు నిర్మించలేదు కావున, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ వీరభద్ర గౌడ్ , అధికారులకు, కాలనీవాసులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు, గతంలో ఎంతో మంది నాయకులు అధికారులు కోరిన పట్టించుకోలేదని, నేడు కూటమి ప్రభుత్వం మా కాలనీకి సిసి రోడ్లు నిర్మించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు , తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో పి ఆర్ ఏ ఈ యమునప్ప, టిడిపి యువ నాయకులు సోమశేఖర్ గౌడ్, రాచయ్య స్వామి, బి కే వీరేష్, మాల మహానాడు నాయకులు వీరభద్ర, పంచాయతీ సెక్రెటరీ నాగరాజు, ఇంజనీర్ అసిస్టెంట్ శివ, రాము, మల్లి, శశి కుమార్, పాల్గొన్నారు.