సిసిఏ ఆమోదం పొందిన ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఎస్ఈ: 532850, ఎన్ఎస్ఈ: ఎంఐసిఈఎల్), ఎల్ఈడి వీడియో డిస్‌ప్లేల రూపకల్పన, అభివృద్ధి, తయారీలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ, తాజాగా రూఫ్ మౌంటెడ్ ఏసి ప్యాకేజ్ యూనిట్స్ కోసం మైక్రోప్రాసెసర్ కంట్రోలర్ పై కంపెనీకి కాపాసిటీ కమ్ కేపబిలిటీ అసెస్‌మెంట్ (సిసిఏ) అనుమతి లభించినట్లు ప్రకటించింది. ఈ పరికరం ఎల్ హెచ్ బి కోచ్‌లు మరియు డబుల్ డెక్కర్ కోచ్‌లు కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది.ఇప్పటికే, మైక్ ఎలక్ట్రానిక్స్ దుబాయ్‌లోని దాని ఉపకంపెనీ మిస్. ఎస్ఓఏ ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ ఎల్ ఎల్ సిలో ₹51 కోట్లు పెట్టుబడి పూర్తిచేసినట్లు ప్రకటించింది. ఈ ఉపకంపెనీ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ విడిభాగాల ట్రేడింగ్ లో నిమగ్నమై ఉంది.తాజాగా, సంస్థ ఏసి మరియు నాన్-ఏసి రైల్వే కోచ్‌లలో డెస్టినేషన్ బోర్డ్స్, జిపిఎస్ ఆధారిత పబ్లిక్ అడ్రెస్ & పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , ఎల్ఈడి డిస్‌ప్లేలు కోసం సిసిఏ అనుమతిని పొందింది.అదనంగా, సంస్థ ఎంఐసికె డిజిటల్ ఇండియా లిమిటెడ్ అనే పూర్తిగా ఆధీనమైన ఉపకంపెనీని స్థాపించింది. ఈ ఉపకంపెనీ స్మార్ట్ మీటర్లు, డిజిటల్ మీటర్లు, రూఫ్ మౌంటెడ్ ఏసి ప్యాకేజ్ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ పవర్ సప్లై సిస్టమ్‌లు, మైక్రోప్రాసెసర్ ఆధారిత పరికరాలు తయారీ, సరఫరా చేస్తుంది.1988లో స్థాపించబడిన మైక్ ఎలక్ట్రానిక్స్, ఎల్ఈడి వీడియో డిస్‌ప్లేలు, టెలికాం సాఫ్ట్‌వేర్, మరియు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉంది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా, దేశవ్యాప్తంగా సేవా కేంద్రాలు కలిగి, అంతర్జాతీయ విస్తరణలో నిమగ్నమై ఉంది.