PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టి.జి భరత్ మంత్రి అవ్వడంతో టిడిపి శ్రేణులు, అభిమానుల సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఏపీ రాష్ట్ర మంత్రిగా కర్నూలు ఎమ్మెల్యే టి.జి భరత్ ప్రమాణస్వీకారం చేయడంతో కర్నూల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, టి.జి భరత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మౌర్య ఇన్లోని టి.జి భరత్ కార్యాలయం వద్ద రంగులు చల్లుకొని టపాసులు పేల్చారు. ప్రకాష్ నగర్ ఆర్చి వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, టి.జి భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ధర్మపేట సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం కొండారెడ్డి బురుజువద్ద కేక్ కట్ చేసి టపాసులు పేల్చి డాన్సులు చేశారు.

About Author