భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండగ వేడుకలు
1 min readమండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముస్లిం సోదరుల సంబరాలు
పల్లెవెలుగు న్యూస్ గడివేముల: ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి, నిస్వార్ధపూరితమైన దైవ భక్తికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని ఆచరిస్తారనే సంగతి తెలిసిందే. సృష్టికర్తయిన అల్లాహ్ అంటే అపారమైన భక్తీ, గౌరవంతో ఆయన చెప్పినట్లుగా తన కన్న కుమారుడినే బలిగా అర్పించేందుకు హజరత్ ఇబ్రహీం సిద్ధపడతారు. త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు అప్పటి నుండి ఈ పండుగను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ పండుగను జరుపుకున్నారు మండల కేంద్రంలోని ఈద్గా వద్ద సోమవారం ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై నమాజ్ ఆచరించారు అనంతరం ముస్లిం మత పెద్ద ఇమామ్ బక్రీద్ పండుగ విశేషాలను చదివి వినిపించారు సందర్భగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగం, సహనాలను ఇచ్చే సందేశాలను అందిస్తుందని అన్రు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లీంలు ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావంతో విశ్వాసం, కరుణ, ఐక్యత సాంకేతమైనీ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.