PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మాండ్ర సురేంద్ర రెడ్డి,కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి,బాలకృష్ణ ఫాన్స్ అధ్యక్షులు తిమ్మారెడ్డి,నాగ సురేష్,నిమ్మకాయల మోహన్,బొల్లెద్దుల రాజన్న,ముర్తు జావలి,కళాకర్,రగడ,ప్రవీణ్, వేణు తదితరులు భారీ కేకును కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు.బాలకృష్ణ సేవలను వారు కొనియాడారు. అదేవిధంగా పట్టణంలోని పాత బస్టాండ్ ఫ్రూట్ మర్చంట్ దగ్గర తిక్కస్వామి,పైపాలెం ఇ నాయతుల్ల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతకుంట కురుమూర్తి,ఎమ్మార్పీఎస్ నాయకులు రాజు ఆంజనేయులు ఏసేపు కేకును కట్ చేశారు.

About Author