PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఎమ్మెల్యే కోట్ల జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: మండల కేంద్రమైన ప్యాపిలి లో డోన్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు తెదేపా నాయకులు కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు . ఈ జన్మదినం వేడుకలు తెదేపా సినియర్  నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, చండ్రపల్లి లక్ష్మీనారాయణ యాదవ్ ఆధ్వరంలో నిర్వహించారు.ఈ సందర్భంగా బుధవారం ప్యాపిలి పట్టణంలోని స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తనయుడు డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా కేకును కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్ మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం లో ప్రతి హృదయాల్లో కోట్ల పేరు వినపడుతుందని, వారు చేసిన అభివృద్ధి ఈరోజు మనమంతా అభివృద్ధి బాటలో పయనిస్తున్నామని, పేద బడుగు వర్గాలకు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆశాజ్యోతి గా నిలిచారని, ఆయన స్ఫూర్తిదాయకంతో మనమంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోప్పేల శ్రీనివాసులు,తెదేపా నాయకులు గడ్డం అంకిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, గొల్ల రామ్మోహన్, బంకు నాగేంద్ర, గండికోట పెద్ద రామాంజనేయులు, కృష్ణమూర్తి మోహన్, ఆర్ ఇ నాగరాజు,ఖాజా ఫీర్, మాజీ ఎంపిటిసి చల్లా వీరాంజనేయులు,అనుదీప్,చిన్న పూజర్ల రమేష్ గౌడ్,రాజా రవి,ఎస్ కె.వలి,జలదుర్గం శ్రీకాంత్,కడితం ప్రతాప్ రెడ్డి,కొమ్మెర్రి వెంకట రాముడు,సుంకన్న , నారాయణ, డాక్టర్ రామ్మోహన్, బర్మా శ్రీధర్, పుల్లారెడ్డి,వెంకట రెడ్డి,కొంగనపల్లె మదు, ప్రిన్సిపాల్ మదు,పుల్లయ్య, బ్యాంకు శీను, ధనం మదు, రాంబాబు, పెద్ద పూజార్ల  గోపాల్, తదితరులు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *