4న జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయ ప్రదం చేయండి
1 min readవీఆర్ఏలకు సిఐటియి పిలుపు
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: వీ ఆర్ ఏ ల సమస్యల పరిష్కారం కొరకు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 4న నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం,ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డోన్ మండల అధ్యక్ష,కార్యదర్శులు టి.రవి కుమార్,ఎ.మహేశ్వర నాయుడు,సీనియర్ నాయకుడు రామచంద్రుడు వీఆర్ఏలకు పిలుపు నిచ్చారు.ఈ మేరకు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి కొరకు స్థానిక కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ మేడం కె.నాగమణి కి వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని,చట్ట విరుద్ధమైన నైటు డ్యూటీలను రద్దు చేయాలని,వీఆర్ఓ,అటెండర్,వాచ్ మెన్,రికార్డు అసిస్టెంట్,డ్రైవర్ ఉద్యోగాలలో అర్హతలు కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని,నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.పై సమస్యల పరిష్కారం కొరకు అనేక రకాలుగా పోరాటాలు చేసినా ప్రభుత్వాలు పరిష్కరించడం లేదన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా సమస్యలు పరిష్కరిస్తానని వీఆర్ఏలకు హామీ ఇచ్చారని ఇప్పటికైనా వాటిని వెంటనే అమలు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మధురాముడు,శివ,హరి,రంగయ్య తదితరులు పాల్గొన్నారు.