PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి

1 min read

అంధులకు అక్షర ప్రధాత లూయిస్ బ్రెయిలీ

దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉంటాం

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

అందుల అభ్యున్నతకి లూయిస్ బ్రెయిలీ ఎంతో కృషి చేశారు

జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: అంధులకోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని రూపొందించిన లూయిస్ బ్రెయిలీ అక్షర ప్రధాతని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు.మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు.  ఈ సందర్బంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  అనంతరం ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్దుల సహాయ సంస్ధ ఆధ్వర్యంలో బ్రెయిల్ లిపి లో రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్బంగా అంధులతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కేక్ కట్ చేశారు.  అనంతరం పలువురు అంధులకు వాకింగ్ స్టిక్స్ ను అందజేశారు. ఈ సందర్బంగా పలువురు అంధులు పాటలు పాడి అందరిని ఆలరించారు. అంధుల సంక్షేమ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ రవీంధ్రబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అంధుల లిపిని కనుగొనడం గొప్ప విషయమని ఆ లిపిని ఉపయోగించుకొని చాలామంది ఉన్నతస్ధాయికి ఎదిగారన్నారు.  దివ్యాంగులకు ప్రభ్రుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతోపాటు జిల్లా యంత్రాంగం దివ్యాంగుల సంక్షేమం కోసం అండగా నిలుస్తుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.  దివ్యాంగులకు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎటువంటి జాప్యం ఉండకూడదని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ అంధుల అభ్యున్నతికి లూయిస్ బ్రెయిలీ ఎంతో కృషి చేశారన్నారు. విద్యా, వికాసానికి కనిపెట్టిన బ్రెయిలీ లిపితో అంధులు సమాజంలో మనోధైర్యంతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ పట్టుదలకు మారుపేరు అయిన లూయిస్ బ్రెయిలీ వైకల్యాన్ని జయించిన మహనీయుడని పేర్కొన్నారు.  అంధులకు అక్షర జ్ఞానాన్ని ప్రసాధించిన మహోన్నతుడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆరు వేల రూపాయలవరకు పెన్షన్ సొమ్ము పెంచి వారి కళ్లలో వెలుగు నింపిందన్నారు.  త్వరలోనే బ్యాక్ లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగుల సంక్షేమ ఉద్యోగుల సంఘ నాయకులు వీరభధ్రరావు మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చూపుతున్న ఆధరణ మరువలేనిదన్నారు.  కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, పూర్వపు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావు, ప్రస్తుత అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్,ఏపీ విజువల్లి చాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె రాధారాణి, జిల్లా అధ్యక్షులు గోపిశెట్టి వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి కె మదన్, దివ్యాంగుల సంక్షేమ ప్రతినిధులు పలువురు అంధ ఉద్యోగులు, విద్యార్థిని ,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *