PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవ వేడుకలు

1 min read

నగరంలో కళకళలాడిన మసీదులు, పురవీధులు

శుభాకాంక్షలు తెలియజేసుకున్న ముస్లిం సోదరులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవ సందర్భంగా (మిలాద్ ఉన్ నబి) పురస్కరించుకొని ఏలూరులో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీలతో పండుగను జరుపుకొన్నారు. హాయ్ ప్రవక్త ప్రతి మానవాళి దేశ సమైక్యత, మానవులలో ఐక్యత, సుందర సమాజ నిర్మాణం, మహిళల రక్షణ వారికి సముచిత స్థానం కల్పించడలని బోధించారన్నారు. యావత్ మానవాళికి ఆయన మార్గదర్శకంగా నిలిచారన్నారు. నేడు ప్రపంచం ఎదుర్కొనే అనేక సమస్యలలో పరిష్కారం మహమ్మద్ ప్రవక్త బోధనలో కనిపిస్తుంది అన్నారు. మహమ్మద్ ప్రవక్త కేవలం ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ఆయన బోధనలతో మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన బోధనలను ఒకసారి అధ్యాయం చేయాలని సూచించారు. ఏలూరు నగరంలో మసీదులు కళకళలాడాయి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు భాయి భాయి అంటూ సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, అన్ని మతాలవారు వారి వారి పండుగలను  కలిసిమెలిసి ఒకరినొకరు సహకరించుకుంటూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని పోలీస్ శాఖ వారు సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *