ఘనంగా 75వ “భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం… వైసిపి పార్టీ శ్రేణులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణం నందు 75వ “భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డా” బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వీరశైవ లింగయత్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వై రుద్ర గౌడ్ ,మున్సిపల్ చైర్మన్ డా” రఘు ,కౌన్సిలర్ నాగేషప్ప ,పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్ ,రాష్ట్ర మాజీ శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ మాచని వెంకటేష్ మాట్లాడుతూ సాధించిన స్వతంత్ర ఫలితాలు ప్రతి ఒక్కరుకు అందించే విధంగా అన్ని వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయాలు అసమానతలు లేని విధంగా అభివృద్ధి చెందే దేశంగా ఆనాడు బాబా అంబేద్కర్ గారి కమిటీలో అనేక మంది మేధావులు అనుభవంతో రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించిన దినంగా ఈరోజు దేశంలో పాటిస్తున్నాము. మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుంది.అలాంటి ప్రాముఖ్యత కల్గిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి.ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.ఈవీయం ల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి.అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనపడాలి.అందరి ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యం కొంతకాలంగా అణచివేయబడుతోంది.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిపించారు అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు/ఇంచార్జులు డిష్ కేశవరెడ్డి,శివప్రసాద్,సుధాకర్, షాబుద్దీన్,నాగేంద్ర,సోమేష్,మాధవ స్వామి,యు కె రమేష్,కుమార్,సయ్యద్ ఫయాజ్,వడ్డే వీరేష్,పి రఘునాథ్ రెడ్డి,పామయ్య,నరసింహులు,ప్రభాకర్,నాసిర్,జేరుబండి రఘువీరా,నభి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.