PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా తెలుగు భాష దినోత్సవం వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కాళోజి జయంతి సందర్బంగా, ఎల్ బి నగర్ లోని శాతవాహన నగర యూత్ అసోసియేషన్   తెలుగు భాష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా పిల్లలకు తెలుగులో వివిధ విభాగాలలో అనగా పద్యం, గేయం, వాఖ్యానం,వ్యాసరచన,  చిత్రలేఖనం అంశాల్లో 1వ తరగతి నుండి 10 వ తరగతి, ఇంటర్  చదువుతున్న విద్యార్థులకు పోటీలు నిర్వహించారు, ఈ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన పిల్లలకు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మంటపం వద్ద నిర్వహించిన తెలంగాణ భాష దినోత్సవ వేడుకల్లో  మెమెంటో, ప్రశంస పత్రం ద్వారా సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, వారి తల్లి, దండ్రులు, భక్తులు, శాతవాహన నగర సంక్షేమ సంఘ సభ్యులు, మహిళ అసోసియేషన్ సభ్యులు , యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు.నిర్వాహకులు రవికుమార్, కృష్ణ ప్రసాద్, జగదీష్ రెడ్డి, భరత్ కాంత్ రెడ్డి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *