మాండ్ర స్వగృహంలో కన్నుల పండుగగా వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఉమాదేవి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య లకు నందికొట్కూరు నియోజకవర్గంలోని నందికొట్కూరు,జూపాడు బంగ్లా,పాములపాడు,కొత్తపల్లి, పగిడ్యాల,మిడుతూరు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు బుధవారం అల్లూరులో శివానందరెడ్డి స్వగృహం కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది.ఆరు మండలాల నుంచి వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు విపరీతంగా రావడంతో శివానందరెడ్డి స్వగృహం కన్నుల పండుగగా ఏర్పడింది.నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పూలమాలలు శాలువాలు సీట్లతో శుభాకాంక్షలు తెలిపారు.లక్ష్మాపురం గ్రామానికి చెందిన గ్రామ టిడిపి నాయకులు ఎన్ భూషిగౌడ్ మరియు నాయకులు శివానందరెడ్డి దంపతులకు మరియు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఎమ్మెల్యే జయసూర్యకు భారీగా కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.