చండ్రపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ సంబరాలు
1 min readవై నాగేశ్వరావు యాదవ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: వై నాగేశ్వరావు గ్రామంలో పర్యటిస్తూ ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో మార్పు కోసం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అలాగే డోన్ నియోజకవర్గం నుంచి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన విధంగా అధికారం చేపట్టిన 30 రోజుల లోపలనే ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం ఎన్నో పనులు చేశారు అని గ్రామస్తులతో చెప్పుకుంటూ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తూ రైతు మేలు కోసం రైతుల కోసం పశువులకు సీజనల్గా వస్తున్న వ్యాధులను నివారించడానికి పశువులకు వ్యాక్సిన్ వేయడం జరిగినది అలాగే పశువుల పెంచడానికి పశుగ్రాసానికి గడ్డి విత్తనాలను అలాగే మొక్కజొన్న విత్తనాలను అందజేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి విద్యాసాగర్, వెంకటేశు, ఆదిలక్ష్మి సచివాలయ సిబ్బంది. ఈ కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షులు కే. బి. దామోదర్ నాయుడు తెలుగుదేశం పార్టీ చండ్రపల్లి గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ఆదినారాయణ, మాజీ ఎంపీటీసీ రామయ్య, బోయ రామకృష్ణ, ప్రకాష్, గోపాలమిత్ర చంద్ర బింగి మోహన్, రామసుబ్బయ్య, పుల్లయ్య, సందీప్, సురేంద్ర, లక్ష్మయ్య, రామ్మోహన్, లక్ష్మణ స్వామి, నాగ అంజి, నరేష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.