కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్మలు కొరుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
1 min readచర్మకారుల సంక్షేమ సంఘం స్థాపించి 30 వసంతాలు
చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొలిమేర హరికృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు ముఖ్యఅతిథిగా ఈనెల 30 తేదీన ఏలూరు నగరంలో రాష్ట్ర చర్మకారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చర్మ కారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, జాతీయ సీనియర్ దళిత నేత డాక్టర్ పొలిమేర హరికృష్ణ చెప్పారు.స్థానిక గన్ బజార్ సంఘ కార్యాలయంలో శనివారం హరి కృష్ణ ముఖ్య నాయకులతో మాట్లాడుతూ చర్మ కార్ల సంక్షేమ సంఘం స్థాపించి 30 వసంతాలు పూర్తి అయ్యాయని ఫిబ్రవరి, మార్చి నెలలో జరుప తలపెట్టిన ఈ యొక్క సదస్సును ఎన్నికల కారణంగా జూన్ నెల ఆఖరిలో చేయదలచామన్నారు. ప్రధానoగా రాష్ట్రంలో చర్మకారుల జీవనస్థితి గతులు అద్వానంగా ఉన్నాయని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లే విషయమే సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు హరికృష్ణ చెప్పారు.హరికృష్ణ ఇంకేమన్నారంటే ప్రభుత్వం తరపున చర్మాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గతంలో ప్రభుత్వం తరఫున చర్మాలు కొనుగోలు కేంద్రాలు ఉండేవని, గుర్తు చేశారు.లెదర్ ఇండస్ట్రీని పటిష్ట పరచాలనిప్రత్యేకంగా చర్మకారుల, డప్పు కళాకారులు పిల్లలకు ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని, ప్రభుత్వ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, రోడ్డు ప్రక్కన చెప్పులు కుట్టే వారికి వ్యాపారం చేసుకునే వెసులుబాటును కలిపించాలని, చర్మకార్ల కుటుంబాలకు ప్రభుత్వంమే పూర్తిగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, చర్మకారులకు,డప్పు కళాకారులకు పింఛన్లు పెంచాలని ఇంకా మరికొన్ని అంశాలపై జరిగే ఈ రాష్ట్ర సదస్సుకు ఏలూరు పార్లమెంట్ సభ్యులు, జిల్లా మంత్రులు, రాష్ట్రంలో ఉండబడే ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్సీలను ఆహ్వానించనున్నట్లు చెప్పారు అదేవిధంగా ముఖ్య సీనియర్ జాతీయ, రాష్ట్ర దళిత నేతలు పాల్గొంటారని హరికృష్ణ తెలియజేశారు. ఈ సమావేశంలో చర్మకార సంఘ నాయకులు బేవునపల్లి లక్ష్మణ్ జొన్నకూటి రవి, ముల్లుల రమేష్, పొలిమేర రాజు, కటారి రాజేష్, నాగేశ్వరరావు,బడుగు రామకృష్ణ, యర్రా సత్యానందం, కులసాల పోతురాజు, పొలిమేర దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.