కేంద్ర కరువు బృందం పర్యటన కు అన్ని ఏర్పాట్లు పూర్తి
1 min readకరువు పరిశీలన కేంద్ర బృందానికి కరువు తీవ్రత విషయాలు వివరంగా తెలియజేయాలి…
డిఆర్ఓ కె.మధుసూదన్ రావు…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కేంద్ర కరువు బృందం పర్యటన కు అన్ని ఏర్పాట్లు చేసి , కరువు తీవ్రత విషయం వారికి వివరంగా తెలియ చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిఆర్ఓ కె. మధుసూదన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించినారు.శనివారం సాయంకాలం డిఆర్ఓ ఛాంబర్ నందు కేంద్ర కరువు బృంద పర్యటన కు చేయవలసిన ఏర్పాట్లను డిఆర్ఓ సమీక్షించారు. ఈనెల 19 మరియు 20 తారీకులలో కేంద్ర కరువు బృంద పరిశీలకులు జిల్లాకు రానున్న సందర్భంగా వారికి గతంలో వివరించిన విధంగా క్షేత్ర పర్యటనలో అన్ని విషయాలు వారికి అర్థము అయ్యేలాగా చర్యలు చేపట్టాలని , అందుకుగాను కరువుకు సంబంధించిన ఫోటోలను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తయారు చేసుకోవాలని డిఆర్వో సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులతో కరువు విషయాలు వెల్లడించే లాగా చర్యలు ఉండాలని తెలిపారు. ముఖ్యంగా కంది పంట నష్టపోయిన మద్దికేర , చిప్పగిరి , ఆలూరు మొదలగు మండలాల సంబంధిత వ్యవసాయ అధికారులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది , గ్రామీణ నీటి సరఫరా విభాగ సిబ్బంది వివరించడానికి అన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించినారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ పనులను డిఐపిఆర్ఓ పర్యవేక్షించాలని ఆదేశించినారు.ఈ సమావేశానికి సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, డిఆర్డిఏ పిడి అమర్నాథ్ రెడ్డి , ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు , డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు , డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్లు అనుపమ , నరసమ్మ , డిస్టిక్ సెరికల్చర్ ఆఫీసర్ విజయ్ కుమార్ , ఇన్చార్జి డి.ఐ.పి.ఆర్.ఓ దివాకర్ రావు మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.