మాదక ద్రవ్యాల అక్రమ కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు
1 min readఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం
మాదకద్రవ్యాల కట్టడి చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి సర్వే చేయలేదని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాదక ద్రవ్యాల సీజ్‌లకు సంబంధించి అన్ని డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల నుండి సమాచారం సేకరిస్తుందని తెలిపారు.గత ఐదేళ్లలో ఓడరేవులలో రూ.11,669 కోట్ల విలువైన మాదక దవ్యాలను సీజ్ చేయగా, దేశవ్యాప్తంగా రూ.1.03 లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశామని, ఆంధ్రప్రదేశ్ లో 21,048 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాల పట్ల అవగాహన కల్పించడంతో ఆధ్యాత్మికత వైపు యువతను మళ్లించేలా చైతన్య పరిచేందుకు వీలుగా ఎన్.సి.బి మిషన్ స్పందన్ తో పాటు మరో ఐదు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఎం.ఓ.యు కుదుర్చుకుందని మంత్రి స్పష్టం చేశారు. 2021-22 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గంజాయి తోటలను నాశనం చేయడానికి ‘పరివర్తన’ ఆపరేషన్ ప్రారంభించబడిందని, పంట నాశనం ఆపరేషన్ 8 దశల్లో చేపట్టి, రూ. 9250 కోట్ల విలువైన 7552 ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేసి, 17,278 మందిని ఎన్ డి పి ఎస్ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలు, బానిసలుగా మారితే తదుపరి పర్యవసానాలపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు, అలాగే ప్రతి ఏటా జూన్ 26న మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి సమాధానం ఇచ్చరన్నరు.ఎన్.ఎఫ్.సి.డి.ఏ మార్గదర్శకాలలో సూచించిన విధంగా మాదకద్రవ్యాల బారిన పడిన వారిని ఆదుకునేందుకు నేషనల్ ఫండ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్ కింద రూ. 2.09 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి ఇచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు.