PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ అధికారులుగా డి ఎఫ్ ఓ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు

1 min read

క్రమశిక్షణతో, అంకితభావంతో ప్రజలకు చేరువుగా విధులు నిర్వహించాలి

జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర ధామ

అటవీ పరిరక్షణ, జంతువుల సంరక్షణ మనందరి బాధ్యత

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా డివిజనల్ అటవి శాఖ అధికారి కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ రవీంద్ర దామా మాట్లాడుతూ అటవీ పరిరక్షణ జంతువుల సంరక్షణ మరియు ప్రజల రక్షణ, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు క్రమశిక్షణతో అంకితభావంతో ప్రతి ఒక్క అటవీ శాఖ అధికారులు విధులు నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నగర యోజన పథకం అమలులోకి వచ్చిందని నగరానికి, మున్సిపాలిటీ లిమిట్స్కి దగ్గరగా ఉన్న ఫారెస్ట్ ఏరియాలలో ప్రజలకు ఫారెస్ట్, (వైల్డ్ లైఫ్) పార్కు అభివృద్ధి చేయడం. పబ్లిక్ నుంచి మనల్ని దగ్గరే చేస్తూ పర్యావరణ కాపాడుతూ పబ్లిక్ తో మనం మమేకమవుతూ ఉండే ఉద్దేశంతో ఈ నగర యోజన స్కీం ముఖ్య ఉద్దేశమన్నరు. ఈ పార్కులలో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలు వాకింగ్. జాగింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్స్ తో పాటు పరిసరాలలో వాల్స్ పై అడవి ప్రాముఖ్యత అటవీ జంతువులు ప్రాముఖ్యత తెలుపుతూ, రకరకాల పక్షుల వాల్ పెయింట్స్ తో పిల్లలకు రకరకాల ఆట వస్తువులతో పర్యావరణ ప్రాముఖ్యతను భావితరాలు తెలుసుకునేందుకు అణువుగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో అనువుగా ఉండే మూడు, నాలుగు ప్రాంతాలను ఎంచుకున్నట్లు తెలిపారు. మొదటిగా నూజివీడు రేంజ్ లో బతుల వారి గూడెం ఫారెస్ట్ బ్లాక్ లో 50 హెక్టార్స్ స్థల సేకరణ జరిగిందని, కొండలు (హిల్స్)  ఎక్కడానికి  అనువుగా సిద్ధం చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర ధామ తెలిపారు. అనంతరం విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లకు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు డిఎఫ్ఓ ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ మెరుగు రంజిత్ కుమార్, నూజివీడు డిఆర్ఓ హరిగోపాల్ మరియు ఎఫ్ఎస్ ఓ లు, ఎఫ్ డిఓ లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author