‘ కుడా ’ చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు..
1 min readకార్యకర్తల సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
- సంబరాలు జరుపుకున్న నాయకులు, అభిమానులు
కర్నూలు, పల్లెవెలుగు: భారీ బహిరంగ సభలో కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ చైర్మన్ గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు బివి జయ నాగేశ్వర రెడ్డి, దస్తగిరి, గౌరు చరితా రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయ సూర్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, మీనాక్షి నాయుడు, రాఘవేంద్ర రెడ్డి, వీరభద్ర గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి నీలకంఠ తదితరుల సమక్షంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో ముందుంటానన్నారు. తనను ఆదరించి, అభిమానించే కార్యకర్తలు, నాయకులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. కర్నూలు నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనను నమ్మి కుడా చైర్మన్ పదవీ అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కర్నూలు ప్రజలకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.