మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా ముస్తాక్ అహ్మద్ ప్రమాణ స్వీకారం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: పార్టీకి చేసిన సేవలు అధినాయకత్వం గుర్తించడం ద్వారా మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకు వచ్చిందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ లౌకికవాద పార్టీ అని, ముస్లింలకు అండగా ఉండే పార్టీ అని, ముస్లింల అభివృద్ధికి కట్టుబడిన పార్టీ అని ఆయన పేర్కొన్నారు. సోమవారం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా మస్తాక్ అహ్మద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు టిడిపి నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, నక్క ఆనందబాబు, ముస్లిం నాయకులు అహ్మద్ షరీఫ్, ఫతావుల్లా, గుంటూరు డిప్యూటీ మేయర్ షకీలా, మైనారిటీ సెల్ నాయకులు ఫైజాన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు మైనార్టీల అభివృద్ధి కోసం ఆనాడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. నేడు వక్ఫ్ సవరణ బిల్లుకు కూడా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం ముస్లింలకు మద్దతుగా నిలుస్తుంది అన్నారు. ముస్లిం మనోభావాలను కాపాడటంలో టిడిపి ముందుంటుందని తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మౌలానా మస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలు గుర్తించి తనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా, నిష్పక్షపాతంగా పేద ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.