డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా మిక్కిలినేని వెంకట శివప్రసాద్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: సాగునీటి-సంఘం ఎన్నికలలో భాగంగా మంగళవారం ఉదయం మండల కేంద్రం హోళగుంద మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు జరిగిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఎల్ఎల్సీ దిగువ కాలువ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేశ్వర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసి 1 పరిధిలోని హాలహర్వి మండలం జే,హోసళ్ళి, బల్లూరు, హోళగుంద 1,2 గజ్జహళ్లి,ఆదోని మండలం సంతేకుడ్లూరు, పెద్ద హరివాణం, కౌతాళం మండలం రౌడూరు గ్రామాల టీసీ అధ్యక్షులకు ఎన్నికలు నిర్వహించగా మిక్కిలిని శివప్రసాద్ ను, చైర్మన్గా, గూళ్యం గ్రామానికి చెందిన పూజారి మల్లన్న వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్గా ఎన్నికైన వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ ఆయకట్టు రైతాంగానికి ఆదుకునేందుకు అహర్నిశలుగా కృషి చేస్తానని నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన రైతాంగానికి రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ ఈశ్వర్,తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వీరభద్ర గౌడ తనయుడు గిరి మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ రాజా పంపన గౌడ, బాబి,మండల కన్వీనర్ తుంబలం తిప్పయ్య, సీనియర్ నాయకులు పంపాపతి, ఊళురు కాడ సిద్ధప్ప, మురళీధర్, అబ్దుల్ సుభాన్, సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్ డి ఎస్ భాషా, తోక వెంకటేష్, ఆదోని టిడిపి నాయకులు సతీష్, గోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.