PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక్క సారి రాఘవేంద్ర రెడ్డి ని ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వండి

1 min read

మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మంత్రాలయం కూటమి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ని ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వండి అని మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న కోరారు. శుక్రవారం  మంత్రాలయం మండలంలో బూదూరు, వి తిమ్మాపురం, ఎం తాండా  గ్రామాలలో జనసేన, టిడిపి, బిజెపి ఎన్డీఏ కూటమి అభ్యర్థి  ఎన్ రాఘవేంద్ర రెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జి బి లక్ష్మన్న మాట్లాడుతూ కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ని గెలిపించాలని ప్రసంగించారు. మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు  ఏవి జరగలేదని చెప్పారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని లక్ష్మన్న జోష్యం చెప్పారు. రాష్ట్రంలో  ఎన్ చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్  జూన్ 4 న ప్రమాణ స్వీకారం చేస్తారని  జోస్యం చెప్పారు. మంత్రాలయం నియోజకవర్గం లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి  రాఘవేంద్ర రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి  ఎన్ రాఘవేంద్ర రెడ్డి  మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు మంత్రాలయం నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో తాగునీటికి చాలా సమస్య ఉందని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని నేను ఎమ్మెల్యే అయిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని నన్ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలిపించాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముందుగా ఆయా గ్రామాలలో కూటమి అభ్యర్థి కి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మాలపల్లి లక్ష్మయ్య, టిడిపి సీనియర్ నాయకులు ఎస్ యం గోపాల్ రెడ్డి, బూదురు టిడిపి నాయకులు సర్పంచ్ నాగరాజు, అబ్రహం, మోజేష్, రాము, దాస్, లోకేష్, రోగప్ప, శాంతి రాజు, శంకర్, ఈరన్న, తిమ్మాపురం టిడిపి నాయకులు శివరాముడు, హనుమంతు, దేవేంద్ర, రాజు, గోపాల్, పరశురామ్, రమేష్, మాధవరం తిమ్మప్ప, మాధవరం తండా టిడిపి నాయకులు మునినాయక్, రంగనాయక్, లింగప్ప నాయక్, టిడిపి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభలనుజయప్రదం చేశారు.

About Author