పేదల సంక్షేమాన్ని మరచిన చంద్రబాబు నాయుడు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద సిపిఐ మండల కార్యదర్శి B.మారప్ప సోమవారం మాట్లాడుతూ నగర ప్రాంతంలో పేదలకు రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వం స్థలాల్లో కొట్టాలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని పేద పేదల నివసిస్తున్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గరలో ఉన్న సచివాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి సచివాలయం పవిత్ర మేడంకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి కృష్ణయ్య ఏఐటీయూసీ మండల కార్యదర్శి రంగన్న మల్లయ్య గోపాల్ నూర్ భాషా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.