పాఠశాలకు క్రీడా సామాగ్రిని అందజేసిన చంద్రమౌళి..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని వడ్డెమాను జిల్లా పరిషత్ గణిత ఉపాధ్యాయుడు డి. ఈశ్వరయ్య అన్నారు. సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డెమాను జిల్లా పరిషత్ పాఠశాలకు కర్నూలు కు చెందిన ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ అధినేత ఎక్కల దేవి చంద్రమౌళి,గణిత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య కోరికపై పాఠశాలకు క్యారం బోర్డ్ లను పంపిణీ చేశారు.ఈ క్రీడా సామాగ్రిని ఈశ్వరయ్య పాఠశాల ఇన్చార్జ్ ఉపాధ్యాయులు రఫీ అహ్మద్, ఫిజికల్ డైరెక్టర్ రాజేశ్వరి దేవి, ఉపాధ్యాయులు అల్లి హుస్సేన్,హబీబుల్లా మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మహమ్మద్ హుస్సేన్ లకు అందజేశారు.ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అంతే ప్రాముఖ్యత క్రీడలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని, పాఠశాలకు క్రీడా సామాగ్రిని అందించిన చంద్రమౌళికి విద్యార్థులు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు ల్యాబ్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.