PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గత నాలుగు రోజులుగా మండలకేంద్రమైన వెలుగోడు లోని అయపురెడ్డి నగర్ లో వెలసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు  తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో  జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిశాయి. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం మహాభారతం భగవద్గీతలపై మద్దయ్య స్వామి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి. ముగింపు సందర్భంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు బళ్ళాని వేంకట సత్యనారాయణ, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, భజన మండలి అధ్యక్షులు తెలుగు నాగలక్ష్మమ్మ, జ్యోత్స్న, సాలమ్మ, అంజనమ్మ, వెంకటేశ్వర్లు,రాజు, శివుడు, ఆంజనేయులు, భరత్ , బి.రాము, నాగేశ్వరరావు, లక్ష్మీ నారాయణ, రమణయ్య, మురళీ కృష్ణ, నాగార్జున, సంజీవరాయుడు, యం. సుబ్రమణ్యం వేదపండితులు, తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రథమ వార్షికోత్సవం

శ్రీ లక్ష్మి ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం సందర్భంగా ఉదయం సుదర్శన మహా మృత్యుంజయ హోమం, మహాబలి పూర్ణాహుతి, 108 కేజీల పులిహోరతో స్వామి వారికి తిరుప్పావడ సేవ, సాయంత్రం 5గంటలకు శ్రీనివాస కళ్యాణం, తదనంతరం భక్తులందరికీ మహాప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు బళ్ళారి వేంకట సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని విజ్ఞప్తి చేశారు.

About Author