సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం
1 min readపల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు : బెంగళూరు నందు సంఘ సేవ రత్న బిరుదు ప్రదానం సభకు అహ్వానించి, హాజరైన నిరుపేద ఆటోడ్రైవర్ తన ప్రతిభా కు 2014లో లిమ్కా వరల్డ్ రికార్డ్ తో పాటు 24 ప్రపంచ రికార్డ్లు మరియు. ఎన్ ఎఫ్ డి సి. జాతీయ అవార్డు 2017 మరియు ప్రపంచ విశ్వవిద్యాలయం, వియత్నాం నుండి డాక్టరేట్ 2015 లోఅందుకున్నారుఅలాగే గత 15 సంవత్సరాల పాటు స్వచ్చందంగా ఎన్నో సేవలు కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వరద బాధితులకు, గాంధి, నెహ్రూ, పూలే, అంబేడ్కర్ వంటి దేశ నాయకుల జయంతి వేడుకలు, స్కూల్ పిల్లల కోసం వ్యాసరచన, డ్రాయింగ్ పోటీ, వికలాంగులకు ఆటలు అలాగే కరోనా టైంలో 35 రోజులు నిరుపేద కుటుంబాలకు బియ్యం కూరగాయలు ఉచిత పంపిణీ వంటి సేవలను మరియు తన విద్యను కొంతమంది పిల్లలకు ఉచిత ట్యుటోరియల్ ద్వారా అందించి, సూపర్ కిడ్స్ రికార్డ్ బ్రేక్ లో నమోదు, ఈ సంవత్సరం డాక్టర్ బారికి చంద్రశేఖర్ తయారు చేసిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ రోబో యంత్రం, డాక్టర్ బారికి చంద్రశేఖర్ దంపతులు వారి మిత్రుల సహకారంతో 02 అక్టోబర్ 2024న విజయవాడ అజిత్ సింధూ నగర్ కాలనీ వరద బాధితులైన 150 కుటుంబాలకు అందించిన సేవకు చేసిన సేవలు గుర్తించిన, గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సంతోష్ హెగ్డే చేతుల మీదుగా ప్రారంభించిన డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం, అనంతరం జస్టిస్ శ్రీ సంతోష్ హెగ్డే మాట్లాడుతూ…, ఒక పేదవాడి కుటుంబం అయినా ధనవంతుల కుటుంబం అయినా ప్రభుత్వం సహాకారం అందించకపోతే భాధ పడకూడదు. తమ వంతు సమాజానికి ఉపయోగపడే విధంగా సేవలు అందించే గుణం అందరిలో అందిపుచ్చుకోవాలి. ఉదాహరణకు ఈ నిరుపేద కుటుంబం రిజిస్ట్రేషన్ లేకుండా వీరి జీవితం లో అందించిన ప్రతిభ, సేవలు మరువలేనివి. ఇలాంటి వారికి మంచి మాత్రమే జరగాలని కోరుకుంటున్నాను. అలాగే రిజిస్ట్రేషన్ సంస్థ ద్వారా అయితే కొందరికి చేయుత ఇవ్వాలని అనుకుంటే…, రెట్టింపు సమాజానికి ఉపయోగపడే విధంగా సేవలు అందించగలరు.అదేవిధంగా డాక్టర్ బారికి చంద్రశేఖర్ కుటుంబం సేవలు గుర్తించి, డాక్టర్ బారికి చంద్రశేఖర్ దంపతులకు ఘన సన్మానం చేశారు అలాగే భారత దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సంతోష్ హెగ్డే సంఘ సేవ రత్న బిరుదు ప్రదానం చేశారు.