బాచేపల్లి తాండాలో ఘనంగా ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min readధర్మాచరణమే మనిషికి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆరాధనకు అలవాటు పడిన చిత్తము ఆవేదనకు దూరమవుతుందని, ఆవేదనను కల్పించే పరిస్థితులు ఆసన్నమైనపుడు ఎవరు శాంతిని కోల్పోకుండా ఉంటారో వారే ధైర్యవంతులని, ధర్మాచరణమే మనిషికి ధైర్యాన్ని ప్రసాదిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, ఆళ్ళగడ్డ మండలం, బాచేపల్లితాండా లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరం నందు వారు ధార్మిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు శ్రీమద్రామాయణం లోని కొన్ని ఘట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్, శీల హరిదాస ఠాకూర్ దాస్, ఉపాద్యాయులు తల్లం వెంకటేశ్వర్లు, ధర్మ ప్రచార మండలి సభ్యులు టి.వి. వీరాంజనేయరావు, సర్పంచ్ నరేంద్ర, పురోహితులు రఘునాథ శర్మ, పూజారి మూడే గోవింద స్వామి, ధర్మ ప్రచారకులు నరసింహ రావు, రాజా నాయక్, నరసింహ నాయక్, వెంకట నాయక్, సేవా నాయక్, బుక్యే ధనకా నాయక్, బుక్యే కృష్ణానాయక్, తదితరులు పాల్గొన్నారు.