12 వ చాతుర్మాస్య దీక్ష స్వీకరించిన శ్రీ మఠం పీఠాధిపతులు
1 min readమంత్రాలయం, పల్లెవెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమెన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు 12 వ చాతుర్మాస్య దీక్షను స్వీకరించారు . శుక్రవారం శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధ్య దైవమైన మూల రాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని, వాధీంద్ర తీర్థుల బృందావనాలను పూర్వపు పీఠాధిపతుల బృందావనాలను దర్శించుకొని మంగళ హారతులు ఇచ్చారు. శ్రీ మఠంలో కొనసాగుతున్న సాంప్రదాయాలను అనుసరించి 41 రోజుల పాటు గ్రామ సరిహద్దు దాటి వెళ్ళకుండా దీక్షలో కొనసాగుతున్న పీఠాధిపతులు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రవచనాల ద్వారా భక్తులకు వీనులవిందు కలిగించనున్నారు. దీక్షలో ఉన్న సమయంలో అత్యవసర పరిస్థితుల్లో సరిహద్దు దాటవలసి వచ్చినా సూర్యాస్తమయంలోపు శ్రీ మఠం చేరుకోవాల్సిన నిబంధన ఉంది. ఈ దీక్షలో శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థుల తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బాలగారు మఠం పీఠాధిపతులు శ్రీ అక్షోభ రామప్రియ తీర్థులు, సోస్లే వ్యాసరాజ మఠం జూనియర్ పీఠాధిపతులు శ్రీ అక్షోభ రామప్రియ తీర్థులు పాల్గొననున్నట్లు శ్రీ మఠం అధికారులు తెలిపారు.