అభివృద్ధి పై పట్టు ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అలాగే మా నవ యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు అలాగే కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని మరోసారి రుజువు చేయడం అయినది. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం చకచక నిర్మాణాలు చేపడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు వరదల రప్పిస్తున్నారు. విజన్ అభివృద్ధి పై పట్టు ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో మరోసారి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చూపిస్తుంది ఒకవైపు అభివృద్ధి సంక్షేమంలో భాగంగా అవ్వ తాతలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4000 ఇస్తూ మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం ఇచ్చే పథకాన్ని అమలుపరుస్తూ మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామని గంటపదంగా చెప్పగలం అని మీడియా మిత్రులకు తెలియజేశారు.