ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే అందజేత..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం లింగం వీధిలో ఉన్న కురుకుంద మాధవి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి ఆమెకు సీఎంఆర్ఎఫ్ నుండి వచ్చిన 73,730 రూపాయల చెక్కును ఎమ్మెల్యే జయసూర్య మరియు పట్టణ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే కు నాయకులు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,మందడి వాణి,వీంద్రారెడ్డి నాయకులు మల్లికార్జున రెడ్డి,కృష్ణారెడ్డి, ఆర్ట్ శ్రీనివాసులు,భరత్, బ్రహ్మయ్య,వేణు,టిడీపీ పట్టణ మహిళా నాయకులు మీనాక్షి దేవి పాల్గొన్నారు.