బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం… సచివాలయ మహిళా పోలీస్..
1 min readహెడ్మాస్టర్ సిస్టర్ స్మిత
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని సచివాలయ మహిళా పోలీస్ ప్రసన్న, పర్వీన్ లు అన్నారు. శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సెయింట్ ఆన్స్ హైస్కూల్లో విద్య నభ్యసిస్తున్న బాలికలకు బాల్య వివాహ నిషేధిత అంశంపై అవగాహన కల్పించారు. పెళ్లి వద్దు ,చదువు ముద్దు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాల్యవివాహాల నిషేధిత చట్టంపై బాలికలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ చాటిన విద్యార్థినులకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పాఠశాల హెడ్మాస్టర్ సిస్టర్ స్మిత , కరస్పాండెంట్ త్రిష బహుమతులను అందజేశారు. అనంతరం సచివాలయ మహిళా సంరక్షక కార్యదర్శి ప్రసన్న మాట్లాడుతూ బాల్యవివాహాల వలన తల్లి బిడ్డ మృతి చెందడం వంటి దుష్ఫలితాలు ఉంటాయన్నారు. తక్కువ బరువు ఉన్న శిశువులు జన్మించడం, గర్భస్రావాలు వంటి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు . బాల్యవివాహాలు చేసిన వారికి, వివాహానికి హాజరైన వారికి , వివాహం జరిపించిన వారికి, సెక్షన్ 10 ప్రకారం శిక్ష అర్హులు అన్నారు. బాల్యవివాహాలు చేస్తున్నారని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆమె తెలిపారు. 10 98, 181, 100 కాల్స్ కు సమాచారం అందజేయాలన్నారు. బలవంతంగా అక్రమంగా బాలికలను రవాణా చేయడం, వారితో బిక్షాటన చేయించడం, మత్తు మందులు విక్రయించడం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పనులు చేస్తే వారిపై సమాచారం అందించాలని వారు కోరారు. ఇట్టి చాకిరి చేయించడం, బాలికలపై లైంగిక నేరాలు, తదితర వాటిపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి ఫోక్సో చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్, ఏడేండ్ల కార గార శిక్ష జీవిత ఖైదు జరిమానా కూడా విధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు చంద్రకళ, హసీనా వహీదా , ఇందుమతి, సుజాత మాబుచాన్ రహమత్ మైమూన్ ,సువర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేష్ నరసింహ తదితరులు ఉన్నారు.