పిల్లల బంగారు భవిష్యత్తు తలిదండ్రల చేతులోనే…
1 min readఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి… మెగా పేరెంట్స్ మీటింగ్ ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద అడ్నీ హైస్కూల్లో మాట్లాడుతున్న అలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులుక్రీడలోల రాణిస్తున్న విద్యార్థులను అభినందిస్తున్న ఎమ్మెల్యేఈ విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకిస్తున్న ఎమ్మెల్యేకార్యక్రమానికి ఎమ్మెల్యేను స్వాగతిస్తున్న హెచ్ఎం నజీర్ అహమ్మద్, టీచర్లుబ్లాక్ కమెండో విద్యార్థులతో ఎమ్మెల్యే విరుపాక్షిహొళగుంద తమ పిల్లలు చదువులో రాణించాలన్నా, వారు ఉన్నత స్థాయికి ఎదగాలన్నా తల్లిదండ్రుల కృషి ఎంతో అవసరమని ఆ దిశగ అడుగులు వెయాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం నజీర్ అహమ్మద్, ఎస్సెమీ, చైర్మన్ ద్వారకనాథ్ అధ్యక్షతన జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పేరెంట్స్ మీటింగ్)కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యేను బ్లాక్ కమెండో విద్యార్థుల మధ్య హెచ్ఎం, ఉపాద్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం వలికారు. ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆయా సబ్జెక్టుల టీచర్లను, క్రీడలు, చదువులో రాణిస్తున్న విద్యార్థులను ఎమ్మెల్యేకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పరిచయం చేశారు. ఈ సందర్సంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో పట్టుదల, కృషి ఉంటే జీవితంలో ఏదైనా గాని సాదిస్తామని, చదువులో కూడా క్రమశిక్షణతో వెళితే భవిషత్తులో మంచి స్థానాల్లో నిలుస్తారని సూచించారు. గత ప్రభుత్వం పేద విద్యార్థులు చదువులో రాణించాలని అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనలాంటి పధకాలు, పాఠశాలలో మౌలిక వసతులు కల్పించిందన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగ చర్యలు తీసుకోవాలన్నారు. 2 వేల మంది విద్యార్థుల ఉన్న ఈ పథకాలను క్రమశిక్షణతో నడిపిస్తును హెచ్ఎం. టీచర్లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో దాతల సహాకారంలో అభివృద్ది వైపు అడుగులు వేయిస్తున్నామని ఇంకా డైనింగ్ హాల్, వంటగది, మీటింగ్ హాల్ తదితర సమస్యలు ఉన్నాయని హెచ్ఎం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు .